ఘనంగా మహర్షి విజయోత్సవం

ఘనంగా మహర్షి విజయోత్సవం

20-05-2019

ఘనంగా మహర్షి విజయోత్సవం

మహేష్‌ బాబు హీరోగా నటించిన మహర్షి సినిమా విజయోత్సవం విజయవాడలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో దర్శకేంద్రుడు కె.రాఘు వేంద్రరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.  చిత్ర బృందమంతా పాల్గొన ఈ కార్యక్రమంలో రాఘవేంద్రరావు మాట్లాడుతూ మహేష్‌ విజయాలు చూసి కృష్ణగారు సంతోషిస్తూ ఉంటారు. మహేష్‌ను తెరకు పరిచయం చేసినందుకు నేనూ ఎంతో గర్విస్తున్నాను. ఈ చిత్రంలో రిషిగా మహేష్‌ ప్రయాణం బాగుంది. రైతు బాగుండాలని చెప్పే అంశం ఆకట్టుకుంది. మే 9ని మహర్షి డేగా ప్రకటించాలని అన్నారు. మహేష్‌ బాబు మాట్లాడుతూ నేను స్టార్‌ హీరో అవుతానని తొలి చిత్రం అప్పుడే రాఘవేంద్రరావు గారు చెప్పారు. మంచి సినిమాతో నాకు కెరీర్‌ను ఇచ్చారాయాన. మహర్షి సినిమా చిత్రీకరణ ప్రారంభించినప్పుడే ఇది మరో పోకిరి అవుతుందని ఆశించాను. మంచి సినిమా చేస్తే అభిమానులు ఎంత సహకరిస్తారో నాకు తెలుసు. ఈ సినిమా నాకెంతో ప్రత్యేకం అని అన్నారు.