కేన్స్ లో తెలంగాణ ఎఫ్ డిసి చైర్మన్

కేన్స్ లో తెలంగాణ ఎఫ్ డిసి చైర్మన్

20-05-2019

కేన్స్ లో తెలంగాణ ఎఫ్ డిసి చైర్మన్

ప్రతిష్ఠాత్మక కేన్స్‌ చిత్రోత్సవాల్లో తెలంగాణ చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధి సంస్థ (టిఎఫ్‌డిసి) చైర్మన్‌ పుస్కూరు రామ్మోహనరావు పాల్గొన్నారు. చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధికి అవసరమైన పెట్టుబడులు, సాంకేతికతతోపాటు స్టూడియోలు నిర్మించడానికి, యానిమేషన్‌, వీడియో గేమింగ్‌ విభాగాల్ని విస్తరించడానికి వివిధ దేశాల ప్రతినిధులతో ఆయన చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. ఇందులో భాగంగా హిందూజా బ్రదర్స్‌ని తెలంగాణలో వినోదరంగంలో స్టూడియోల నిర్మాణాన్ని చేపట్టాలని ఆయన తెలంగాణ చిత్ర పరిశ్రమ తరపున ఆహ్వానించినట్టు రామ్మోహనరావు సన్నిహితులు తెలిపారు. చిత్రోత్సవాలకి నిర్మాత, డిజీక్వెస్ట్‌ చైర్మన్‌ బసిరెడ్డి, ఐటీపీవో ప్రెసిడెంట్‌ ఆసిఫ్‌ ఇక్బాల్‌ హాజరయ్యారు.