విజయ్ దేవరకొండ హీరో ప్రారంభం

విజయ్ దేవరకొండ హీరో ప్రారంభం

20-05-2019

విజయ్ దేవరకొండ హీరో ప్రారంభం

విజయ్‌ దేవరకొండ, మాళవికా మోహనన్‌ జంటగా ఆనంద్‌ అన్నామలై దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తున్న హీరో లాంఛనంగా ప్రారంభమైంది. హీరో హీరోయిన్లపై చిత్రీకరించిన తొలి సన్నివేశానికి దర్శకుడు కొరటాల శివ క్లాప్‌ కొట్టగా, గొట్టిపాటి రవికుమార్‌ కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు. క్రీడా నేపథ్యంలో మ్యూజికల్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కనుంది. ఇటువంటి డిఫరెంట్‌ జోనర్‌లో విజయ దేవరకొండ నటిస్తుండటం ఇదే తొలిసారి అని మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ తెలిపింది. దిగంత్‌ మచాలే, వెన్నెల కిశోర్‌, శరణ్‌ శక్తి, రాజా కృష్ణమూర్తి, జాన్‌ ఎడతట్టిల్‌ నటించనున్న ఈ చిత్రానికి కెమెరా: మురళీ గోవిందరాజులు, సంగీతం: ప్రదీప్‌కుమార్‌.