కెతికా శర్మకు బంపర్ ఆఫర్

కెతికా శర్మకు బంపర్ ఆఫర్

21-05-2019

కెతికా శర్మకు బంపర్ ఆఫర్

మొదటి సినిమా విడుదలకు ముందే మలి సినిమా ఛాన్స్‌ కొట్టేసింది కెతికా శర్మ. పూరి జగన్నాధ్‌ తనయుడు పూరి ఆకాష్‌ నటిస్తున్న రొమాంటిక్‌ చిత్రం ద్వారా తెరంగేట్రం చేస్తున్న ఈ భామ బన్నీ సరసన నటించే బంపర్‌ ఆఫర్‌ దక్కించుకుందని తెలుస్తోంది. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ నటించే సినిమాలో మెయిన్‌ హీరోయిన్‌గా పూజా హెగ్డే ఎంపిక కావడం తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రంలో సెకండ్‌ హీరోయిన్‌ కోసం వెతికి వెతికి కెతికను ఎంపిక చేసుకున్నారు. ఇటీవల మొదటి షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో సెకండ్‌ షెడ్యూల్‌ మొదలు పెట్టుకోనున్నది.