కేన్స్ లో మెరిసిన మాజీ ప్రపంచ సుందరి

కేన్స్ లో మెరిసిన మాజీ ప్రపంచ సుందరి

21-05-2019

కేన్స్ లో మెరిసిన మాజీ ప్రపంచ సుందరి

కేన్స్‌ మూవీ ఫెస్టివల్‌ సందర్భంగా అన్ని చిత్ర పరిశ్రమలకు చెందిన ముద్దుగుమ్మలు ప్రముఖ డిజైనర్స్‌ రూపొందించిన హాట్‌ హాట్‌ డ్రెస్సెస్‌తో వీక్షకుల గుండెల్లో సెగలు పుట్టిస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్‌ నుంచి ప్రియాంక చోప్రా, దీపికా పడుకొనే, కంగనా వంటి స్టార్లు డిజైనర్‌ డ్రెసుల్లో సెక్సీ ఫోజులతో ఉత్సవంలో మెరిశారు. తాజాగా ఐశ్వర్యరాయ్‌ బచ్చన్‌ కేన్స్‌ రెడ్‌కార్పెట్‌పై తళుకులీనారు. గోల్డెన్‌ గ్రీన్‌ కలర్‌లో ఉన్న ఫిష్‌ కట్‌ డిజైనర్‌ డ్రెస్‌లో వచ్చిన మాజీ ప్రపంచ సుందరి నిజంగా మత్స్య కన్య దిగ్గివచ్చినదా అన్నట్టు ఉంది. ఇప్పటికే నలుగు పదుల వయసులో ఉన్న ఐశ్వర్య నేటితరం హీరోయిన్స్‌కు ఏమాత్రం తగ్గని అందంతో వారికి గట్టిపోటీనే ఇస్తోంది. ఈసారి కెన్స్‌ ఉత్సవంలో ఐశ్వర్య తన కూతురు ఆరాధ్యాతో కలిసి పాల్గొంది.