కేన్స్ లో మురిపించిన అందాల భామలు

కేన్స్ లో మురిపించిన అందాల భామలు

23-05-2019

కేన్స్ లో మురిపించిన అందాల భామలు

కేన్స్‌ 2019 చిత్రోత్సవాలు ఈనెల 25తో ముగియనున్నాయి. మరో మూడు రోజుల పాటు ఫ్రెంచి రివెరాలో ఈ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ ఏడాది కేన్స్‌ ఉత్సవాల్లో మునుపెన్నడూ లేనంతగా బాలీవుడ్‌ అందగత్తెలు తమ హోయల్ని ప్రదర్శించారు. ముఖ్యంగా మాజీ విశ్వసుందరి ఐశ్వర్యారాయ్‌ ఈసారి మునుపటి కంటే హాట్‌గా దర్శనమిచ్చి అందరికీ పెద్ద షాకిచ్చింది. తాజాగా వైట్‌ అండ్‌ వైట్‌ డిజైనర్‌  లుక్‌లో కనిపించింది ఐష్‌. ఈ తెల్ల రంగు రఫెల్‌ గౌన్‌లో ఐష్‌ మురిపించింది. ఇక కేన్స్‌ రెడ్‌ కార్పెట్‌పై అదిరిపోయే డ్రెస్‌లో తళుక్కు మంది బాలీవుడ్‌ బ్యూటీ మల్లికా శెరావత్‌. ఫ్యాషన్‌ డిజైనర్‌ మార్కో టస్సనీ రూపొందించిన డ్రెస్‌లో ఈ భామ మెరిసింది.