మెగాస్టార్ అభిమానులకు ఓ గుడ్ న్యూస్

మెగాస్టార్ అభిమానులకు ఓ గుడ్ న్యూస్

24-05-2019

మెగాస్టార్ అభిమానులకు ఓ గుడ్ న్యూస్

మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం సైరా నరసింహారెడ్డి ఎప్పుడు విడుదలవుతుందా అని ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దాదాపు 14 నెలల నుంచి ఈ సినిమా సెట్స్‌పైనే ఉంది. షూటింగ్‌ ఎప్పుడూ పూర్తవుతుందా? టీజర్‌ ఎప్పుడొస్తుందా? అని మెగా అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి రీషూట్లు జరుగుతున్నాయని... అందుకే సినిమా ఆలస్యమవుతోందని వస్తున్న వార్తలు అభిమానులను బాగా కలవరపెడుతున్నాయి. అయితే ఇప్పుడు ఓ గుడ్‌న్యూస్‌ వచ్చేసింది. సైరా షూటింగ్‌ దాదాపుగా పూర్తికావచ్చింది మరో పది రోజులు షూటింగ్‌ చేస్తే సినిమా పూర్తయినట్టే. త్వరలో టీజర్‌ను విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తోందట. అంతకు ముందే చిరంజీవి మొదలుకొని నటీనటులందరి లుక్‌ను ఒక్కొక్కటిగా బయటకు తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ఏడాది అక్టోబర్‌లో సైరా ను విడుదల చేయాలని అనుకుంటున్నారు. రామ్‌చరణ్‌ నిర్మాతగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం దాదాపు 200 కోట్ల బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటోంది. నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో అబితాబ్‌బచ్చన్‌ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు.