మెగాస్టార్ సరసన ఐసు?

మెగాస్టార్ సరసన ఐసు?

25-05-2019

మెగాస్టార్ సరసన ఐసు?

సైరా సినిమాలో అమితాబ్‌ బచ్చన్‌తో నటింపజేస్తున్న రామ్‌చరణ్‌.. తన డాడీ తదుపరి సినిమాలో అమితాబ్‌ బచ్చన్‌ కోడలు ఐశ్వర్యరాయ్‌తో నటింపజేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారని తెలుస్తోంది. ఇంతకుముందు పలు సినిమాల్లో చిరంజీవి సరసన ఐశ్వర్యను తీసుకోవాలని ప్రయత్నించినప్పటికీ.. కారణాంతరావల వల్ల కార్యరూపం దాల్చలేదు. అయితే ఇపుడు తెలుగు సినిమా పరిధి విపరీతంగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో బాలీవుడ్‌ హీరోలు, విలన్లు, హీరోయిన్లను తీసుకోవడం సర్వసాధారణమైపోయింది. మరి కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి నటించే సినిమాలో ఐశ్వర్యరాయ్‌ను తీసుకునేందుకు సంప్రదింపులు జరుపుతున్నారంటూ వస్తున్న వార్తలో నిజమెంతో తెలియడానికి మరికాస్త సమయం పడుతుంది.