సాహో లో సల్మాన్ లేడు

సాహో లో సల్మాన్ లేడు

25-05-2019

సాహో లో సల్మాన్ లేడు

ప్రభాస్‌, శ్రద్ధా కపూర్‌ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సాహో చిత్రంలో బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ నటిస్తున్నారని ప్రచారం జరిగింది. ఇందులో సల్మాన్‌ది అతిథి పాత్ర అయినా ఈ చిత్రానికే అది హైలెట్‌గా నిలిచే అవకాశం ఉందని అనుకున్నారు. కానీ సల్మాన్‌ సాహో లో నటించడం లేదని ఈ చిత్ర దర్శకుడు సుజిత్‌ తెలిపారు. ఈ సినిమా ఆగస్టు 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్టు ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రంలో జాకీష్రాఫ్‌, నెయిల్‌ నితిన్‌ ముఖేష్‌, మందిరా బేడీ, చంకీపాండే, మహేశ్‌ ముఖర్జీ, అర్జున్‌ విజయ్‌, మురళి శర్మ తదితరులు నటిస్తున్నారు.