ఇవన్నీ నిజమైతే ఎంత బావుండునో

ఇవన్నీ నిజమైతే ఎంత బావుండునో

25-05-2019

ఇవన్నీ నిజమైతే ఎంత బావుండునో

రష్మిక ఉందంటే చాలు జోనర్‌తో సంబంధం లేకుండా కుర్రకారు సినిమా థియేటర్లకు పరుగులు తీస్తున్నారు.  కేవలం రెండు చిత్రాలతో అమాంతం ఇమేజ్‌ తెచ్చుకున్న బ్యూటీ రష్మిక. తెలుగులో చలో, గీతగోవిందంలాంటి ప్రాజెక్టుల్లో తన అందం, ఆహార్యం, అభినయంతో కుర్రకారు మనుసులు కొల్లగొట్టింది రష్మిక. తెలుగుతోపాటు తమిళంలోనూ చాన్స్‌ల మీద చాన్స్‌లందుకుంటూ కెరీర్‌లో వేగంగా పరుగులు తీస్తోంది ఈ బ్యూటీ. అయితే తమిళంలో స్టార్‌ హీరో విజయ్‌తో ప్రాజెక్టుకు చేసేందుకు రష్మిక సైన్‌ చేసిందంటూ వస్తోన్న వార్తలపై ఎట్టకేలకు స్పందించింది. ప్రస్తుతం దర్శకుడు అట్లీకుమార్‌తో క్రీడా నేపథ్యంలో 63వ సినిమా చేస్తున్నాడు విజయ్‌. అయితే 64వ ప్రాజెక్టులో విజయ్‌ సరసన రష్మికను ఎంపిక చేసుకున్నట్టు కథనాలు వెలువడ్డాయి. దీనిపై తాజాగా స్పందిస్తూ ఇవన్నీ నిజమైతే ఎంత బావుండునో అనిపిస్తుంది. కానీ, విజయ్‌ ప్రాజెక్టు కోసం ఇంతవరకూ నన్నెవరూ సంప్రదించలేదు అంటూ వెరైటీ సమాధానమిచ్చింది. ప్రస్తుతం తమిళంలో కార్తితో సినిమాకు సిద్దమైంది రష్మిక. రెమో ఫేమ్‌ బక్కియరాజ్‌ కన్నన్‌ తెరకెక్కించనున్న ప్రాజెక్టులో కార్తితో జోడీ కట్టనుందట. ఇప్పుడు రష్మిక సీజన్‌ నడుస్తోంది. కనుక కాలం కలిసొస్తే విజయ్‌తో జోడీకట్టే చాన్స్‌ రాకపోదు.