గీతా ఆర్ట్స్ లో అఖిల్ కొత్త సినిమా

గీతా ఆర్ట్స్ లో అఖిల్ కొత్త సినిమా

25-05-2019

గీతా ఆర్ట్స్ లో అఖిల్ కొత్త సినిమా

అఖిల్‌ అక్కినేని హీరోగా జిఏ 2 సంస్థ నిర్మించే చిత్రం షూటింగ్‌ మొదలైంది. అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నీ వాసు, వాసు వర్మ నిర్మాతలుగా తీస్తున్నారు. బొమ్మరిల్లుఫేమ్‌ భాస్కర్‌ దర్శకుడు. హైదరాబాద్‌లో షూటింగ్‌ శ్రీకారం చుట్టారు. తొలి సన్నివేశానికి నాగార్జున గౌరవ దర్శకత్వం వహించారు. అల్లు అర్జున్‌ తనయుడు అల్లు అయాన్‌ కెమెరా స్విచాన్‌ చేశారు. బేబి అన్విత క్లాప్‌ కొట్టారు. నాగార్జున, అల్లు అరవింద్‌ కుటుంబసభ్యులతో పాటు చిరంజీవి సతీమణి సురేఖా పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలను షెడ్యూల్స్‌ని త్వరలో వెల్లడిస్తాం అని నిర్మాతలు వెల్లడించారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: వి.మణికందన్‌, సంగీతం: గోపీసుందర్‌, కథ, స్క్రీన్‌ప్లే దర్శకత్వం: భాస్కర్‌.