ఈనెల 21న కెప్టెన్ రాణాప్రతాప్

ఈనెల 21న కెప్టెన్ రాణాప్రతాప్

11-06-2019

ఈనెల 21న కెప్టెన్ రాణాప్రతాప్

హరినాథ్‌ పొలిచెర్ల కథానాయకుడిగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం కెప్టెన్‌ రాణాప్రతాప్‌. ఎ జవాన్‌ స్టోరీ ఉపశీర్షిక. చరణ్‌ షకీల్‌ స్వరాలను సమకూర్చిన ఈ చిత్ర గీతాలు హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. ఆడియో సీడీలను దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించారు. ప్రచార చిత్రాన్ని సీనియర్‌ నటుడు సుమన్‌ విడుదల చేశారు. హరినాథ్‌ పొలిచెర్ల మాట్లాడుతూ సైనికుల జీవితాలకు దృశ్యరూపంగా ఉంటుంది. కుటుంబాల్ని త్యాగం చేస్తూ దేశాన్ని సైనికులు ఎలా కాపాడుతున్నారనే ఇతివృత్తంతో రూపొందించాం. ఈ నెల 21న సినిమాను విడుదల చేస్తాం అని తెలిపారు. ఇందులో తాను ఆర్మీ మేజర్‌ పాత్రను పోషించానని, శక్తివంతంగా ఉంటుందని సుమన్‌ పేర్కొన్నారు. హరినాథ్‌ బహుముఖ ప్రజ్ఞాశాలి అని, అన్ని వర్గాల వారిని నచ్చేలా ఆయన ఈ సినిమాను రూపొందించారని తమ్మారెడ్డి భరద్వాజ తెలిపారు. ఈ కార్యక్రమంలో జ్యోతిరెడ్డి, జొన్నవిత్తుల, వడ్డెపల్లి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.