గ్యాంగ్ స్టర్ గా వరుణ్ తేజ్

గ్యాంగ్ స్టర్ గా వరుణ్ తేజ్

11-06-2019

గ్యాంగ్ స్టర్ గా వరుణ్ తేజ్

వరుణ్‌ తేజ్‌, దర్శకుడు హరీష్‌ శంకర్‌ కాంబినేషన్‌లో రూపొందుతోన్న సినిమా వాల్మీకి. 14 రీల్స్‌ ప్లస్‌ బ్యానర్‌పై రామ్‌ ఆచంట, గోపి ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో వరుణ్‌ తేజ్‌ గ్యాంగ్‌ స్టర్‌ పాత్రలో నటిస్తున్నారు. తమిళ హీరో అధర్య మురళి కీలక పాత్రలో కనిపించబోతున్నారు. పూజా హెగ్డే, మృణాళిని రవి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి ఈ చిత్రాన్ని సెస్టెంబర్‌ 6న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మిక్కి జె.మేయర్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఐనాంక బోస్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.