వెంకీ సరసన టబు ?

వెంకీ సరసన టబు ?

11-06-2019

వెంకీ సరసన టబు ?

పాతికేళ్ల తరువాత వెంకీతో మళ్లీ టబు జోడీ కడుతోంది. అప్పుడు స్ట్రెయిట్‌ సినిమాలో. ఇప్పుడు రీమేక్‌లో. అంతే తేడా. రీమేక్‌ సినిమా అనగానే సీనియర్‌ హీరోల్లో ఠక్కున గుర్తుకొచ్చేది వెంకటేష్‌. వెంకీ సక్సెస్‌ చిత్రాల్లో ఎక్కువ భాగం రీమేక్‌లే కనిపిస్తాయి. తాజాగా మరో రీమేక్‌కు వెంకీ సిద్ధమవుతున్నట్టు సమాచారం. కొద్దిరోజుల క్రితం బాలీవుడ్‌లో భారీ వసూళ్లు రాబట్టిన అజయ్‌ దేవ్‌గణ్‌ సినిమా దే దే ప్యార్‌ దే రీమేక్‌ రైట్స్‌ సురేష్‌ ప్రొడక్షన్స్‌ తీసుకుంది. వినోదభరితంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని వెంకటేష్‌ హీరోగా నిర్మించనున్నారట. అయితే, హిందీలో టబు చేసిన పాత్రను ఇటు తెలుగులోనూ టబుతోనే చేయించనున్నట్టు సమాచారం. పాతికేళ్ల క్రితం కూలీ నెం 1లో వెంకీతో జోడికట్టిన టాబు, మళ్లీ ఇంతకాలానికి వెంకీ సరసన కనిపించనుందన్న మాట. హిందీలో రకుల్‌ చేసిన పాత్రకి తెలుగులోనూ ఆమెనే  తీసుకుంటారో లేదో చూడాలి.