13న సాహో ట్రైలర్

13న సాహో ట్రైలర్

11-06-2019

13న సాహో ట్రైలర్

ప్రభాస్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం సాహో. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతోంది. శ్రద్ధా కపూర్‌ కథానాయిక. సుజిత్‌ దర్శకుడు. యువీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఆగస్టు 15న విడుదల చేయనున్నారు. జూన్‌ 13న సాహో నుంచి ట్రైలర్‌ వస్తోంది. అంతర్జాతీయ ప్రమాణాలతో తెరకెక్కించిన చిత్రమిది. యాక్షన్‌ సన్నివేశాలు హాలీవుడ్‌ స్థాయిలో ఉంటాయి. వాటి కోసం చాలా ఖర్చు పెట్టాం. షేడ్స్‌ ఆఫ్‌ సాహో పేరుతో రెండు టీజర్లను విడుదల చేశాం. వాటికి మంచి స్పందన వచ్చింది. మది, సాబు సిరిల్‌, శ్రీకర్‌ ప్రసాద్‌ లాంటి సాంకేతిక నిపుణులు ఈ సినిమా కోసం పనిచేశారు. యాక్షన్‌ సన్నివేశాల్ని హాలీవుడ్‌ నిపుణుల పర్యవేక్షణలో తీర్చిదిద్దాం. అవి అభిమానుల్ని అలరిస్తాయి. నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని దర్శక నిర్మాతలు తెలిపారు.