'భారత్' బ్రాండ్ అంబాసిడర్స్ గా ప్రియాంక చోప్రా దంపతులు

'భారత్' బ్రాండ్ అంబాసిడర్స్ గా ప్రియాంక చోప్రా దంపతులు

15-06-2019

'భారత్' బ్రాండ్ అంబాసిడర్స్ గా ప్రియాంక చోప్రా దంపతులు

ప్రచారం కోసం రకరకాల వదంతులు సృష్టించడం మాత్రమే కాదు.. వివాదాలు సృష్టించడంలోనూ బాలీవుడ్‌ ఫిలిం మేకర్స్‌ మహా సిద్ధహస్తులు. భారత్‌ చిత్రం నుంచి వైదొలగిన ప్రియాంక చోప్రాను ఆ సినిమా ప్రచారం కోసం వాడుకుంటున్న తీరు చూసి అందరూ విస్తుపోతున్నారు. నిక్‌ జోనాస్‌తో పెళ్లి కోసం భారత్‌ సినిమాను ప్రియాంక వదులుకుంది. దాంతో ప్రతి సందర్భంలో ఈ అంశాన్ని సల్మాన్‌ ప్రస్తావిస్తూనే ఉన్నాడు. తద్వారా సినిమాకు ఉచిత ప్రచారం అందిస్తున్నాడు. మిశ్రమ స్పందన రాబట్టుకున్న భారత్‌ చిత్రం మెల్లగా 200 కోట్ల క్లబ్బులో చేరేందుకు ఆపసోపాలు పడుతోంది.