ఎన్టీఆర్ అభిమానులకు స్పెషల్ గిప్ట్

ఎన్టీఆర్ అభిమానులకు స్పెషల్ గిప్ట్

15-06-2019

ఎన్టీఆర్ అభిమానులకు స్పెషల్ గిప్ట్

స్టార్‌ హీరో ఎన్టీఆర్‌కు ఇద్దరు అబ్బాయిలు ఉన్న విషయం తెలిసిందే. పెద్ద కుమారుడు అభయ్‌ రామ్‌ కాగా రెండ కుమారుడు భార్గవ్‌ రామ్‌. అయితే శుక్రవారం తారక్‌ రెండో అబ్బాయి భార్గవ రామ్‌ తొలి పుట్టిన రోజును ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రెండు స్పెషల్‌ ఫొటోలను ఎన్టీఆర్‌ సోషల్‌ మీడియాతో పోస్ట్‌ చేశారు. ఒక ఫొటోలో భార్గవ రామ్‌ను తారక్‌ దగ్గరకు తీసుకుని వెనుక నుంచి నవ్వుతూ కనిపించగా. మరో ఫొటోలో అన్నదమ్ములు అభయ్‌ రామ్‌, భార్గవ్‌ రామ్‌ దర్శనమిచ్చారు. కేవలం ప్లిలలతో మాత్రమే ఫొటోలు షేర్‌ చేసుకున్న తారక్‌ అందులో సతీమణిని మినహాయించారు. భార్గవ్‌ తొలి పుట్టినరోజు అని ఎన్టీఆర్‌ క్యాప్షన్‌ ఇచ్చారు. ఇప్పుడు ఈ ఫొటోలు బాగా వైరల్‌ అవుతున్నాయి. ఇక అభయ్‌ రామ్‌ను ఇంతకు ముందు చూశారు కానీ భార్గవ్‌ రామ్‌ను చూడటం మాత్రం అభిమానులకు ఇదే మొదటిసారి. 20 లేదా పాతికేళ్ల తర్వాత తమ హీరోకు ఇద్దరు వారసులు ఉంటారని అప్పుడే అభిమానులు మురిసిపోతున్నారు.