షారూక్ ఖాన్ కు అరుదైన గౌరవం

షారూక్ ఖాన్ కు అరుదైన గౌరవం

15-06-2019

షారూక్ ఖాన్ కు అరుదైన గౌరవం

బాలీవుడ్‌ కింగ్‌ షారూక్‌ఖాన్‌కు ఓ అరుదైన గౌరవం దక్కింది. ఆగస్టు 8 నుంచి 17 వరకు జరగనున్న వార్షిక భారతీయ చలన చిత్ర ప్రదర్శన ఉత్సవానికి ముఖ్య అతిథిగా హాజరు కావాల్సిందిగా ఆస్ట్రేలియాకు చెందిన విక్టోరియా గవర్నమెంట్‌ ఆయనకు ఆహ్వానం పంపింది. ఈ కార్యక్రమానికి రావటానికి షారూక్‌ ఒకే అన్నారట... దీంతో ఈ కార్యక్రమానికి హాజరవుతున్న మిగతా అతిథులతో పాటు ఈ నెల 8న కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారని తెలిసింది. గత ఏడాది జీరో అనే ఓ ప్రయోగాత్మక మూవీలో మరగుజ్జగా కన్పించారు షారూక్‌.. ప్రస్తుతానికి ఆయన మరో  కొత్త మూవీకి కమిట్‌ కాలేదు. విక్రమ్‌ వేదా తమిళ్‌రీమేక్‌, అలాగే డాన్‌ 3 కరుణ్‌జోహార్‌ మూవీలో నటిస్తారని ఊహాగానాలు వచ్చినా ఒక్క ప్రాజెక్టు కార్యరూపం దాల్చలేదు.