శశికళ లో కాజల్ దేవగన్ ?

శశికళ లో కాజల్ దేవగన్ ?

17-06-2019

శశికళ లో కాజల్ దేవగన్ ?

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి, ప్రముఖ నటీమణి జయలలితతో ఆమె నెచ్చలి శశికళకు గల అనుబంధం గురించి తెలిసిందే. అందుకే జయలలిత బయోపిక్‌గా తాను నిర్మిస్తున్న చిత్రానికి శశికళ అనే పేరు పెట్టారు ప్రముఖ నిర్మాత, రాజకీయవేత్త, తెలుగు యువశక్తి సారధి కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి. టైటిల్‌తోనే అందరి దృష్టినీ ఆకర్షించిన ఈ చిత్రంలో టైటిల్‌ పాత్ర కోసం ప్రముఖ నటీమణ కాజల్‌ దేవగన్‌ను ఎంపిక చేసే అవకాశముందని తెలుస్తోంది. ఈ విషయంపై కాజోల్‌ను సంప్రదించినప్పుడు, ఆమె చాలా సానుకూలంగా స్పందించిందని, అయితే ఇంతలో అజయ్‌ దేవన్‌ ఫాదర్‌ వీరు దేవగన్‌ మరణించడంతో, ఆమెను మళ్లీ సంప్రదించే అవకాశం రాలేదని సమచారాం. పెర్‌ఫార్మన్స్‌ పరంగా పవర్‌ హౌస్‌ అని పేరెన్నికగన్న కాజల్‌ శశికళ సినిమాలో నటించేందుకు అంగీకారం తెలిసిన మరుక్షణం... ఈ సినిమాకి కనీవినీ ఎరుగని క్రేజ్‌ రావడం ఖాయం.