విజయ్ కి జోడీగా రకుల్ ?

విజయ్ కి జోడీగా రకుల్ ?

17-06-2019

విజయ్ కి జోడీగా రకుల్ ?

రకుల్‌ ప్రీత్‌సింగ్‌ వరుస సినిమాలు అంగీకరించడం లేదు. కానీ క్రమం తప్పకుండా క్రేజీ ప్రాజెక్ట్స్‌లో భాగం అవుతున్నారు. ప్రస్తుతం తెలుగులో నాగార్జునతో మన్మథుడు2లో నటిస్తున్నారామె. తమిళంలో శివకార్తికేయన్‌తో ఓ సినిమా చేస్తున్నారు. హిందీలో మర్జావా అనే చిత్రం చేస్తున్నారు. తాజాగా తమిళ స్టార్‌ హీరో విజయ్‌కి జోడీగా రకుల్‌ నటించస్తున్నారని తెలిసింది. తమిళ యంగ్‌ డైరెక్టర్‌ లోకేశ్‌ కనగరాజత్‌తో విజయ్‌ ఓ సినిమా చేయబోతున్నారు. ఇందులో హీరోయిన్‌గా పలువురి పేర్లు వినిపించాయి. అయితే రకుత్‌ప్రీత్‌ అయితే బావుంటుందని చిత్రబృందం భావిస్తోందని కోలీవుడ్‌ సమాచారం. విజయ్‌తో నటిస్తే మాత్రం రకుల్‌ కోలీవుడ్‌లో టాప్‌ లీగలోకి ఎంటర్‌ అవడం ఖాయం అనే మాట వినిపిస్తోంది.