మధుబాల బయోపిక్ లో నటించాలని ఉంది!

మధుబాల బయోపిక్ లో నటించాలని ఉంది!

17-06-2019

మధుబాల బయోపిక్ లో నటించాలని ఉంది!

బయోపిక్‌ల ట్రెండ్‌ అన్ని చిత్రసీమల్లోనూ నడుస్తోంది. సినీ తారలు, ఆటగాళ్లు, రాజకీయ నాయకుల జీవితాలు తెరపైకొస్తున్నాయి. అలాంటి పాత్ర తమ వరకూ వస్తే బాగుంటుందని ఆశించే నటీనటులెందరో. కియారా అడ్వాణీ కూడా ఓ బయోపిక్‌లో నటించాలని కలలు కంటోంది. ఈ విషయం ఆరా తీస్త బయోపిక్‌ అంటటే నాక్కూడా ఇష్టమే. నా కెరీర్‌ ప్రారంభంలోనే ధోనీ బయోపిక్‌లో పాలు పంచుకున్నా. నిజ జీవిత పాత్రలు పోషించాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. నటీనటులకు అదోసవాల్‌. నా వరకూ మధుబాల బయోపిక్‌లో నటించాలని ఉంది. ఆమె పాత్రలో నన్ను తెరపై చూసుకోవాలని ఉంది. మధుబాల గొప్ప నటి. ఆమె ఎదిగిన తీరు ఆదర్శప్రాయం. ఆమె కథని సినిమాగా తీస్తే బాగుంటుందంటోంది.  తన సినీ ప్రయాణం గురించి వివరిస్తూ నటిగా నాకు అందరూ ఆదర్శమే. కరీనా అంటే చాలా ఇష్టం. అయితే ఎవ్వరినీ అనుసరించను. కథా నాయికగా నాకంటూ ఓ శైలి సృష్టించుకోవాలని ఉంది అని చెప్పింది కియారా. అర్జున్‌రెడ్డి హిందీ రీమేక్‌ కబీర్‌సింగ్‌లో నటించింది కియారా.