సూపర్ స్టార్ కు సెలవులు అయిపోయాయి

సూపర్ స్టార్ కు సెలవులు అయిపోయాయి

18-06-2019

సూపర్ స్టార్ కు సెలవులు అయిపోయాయి

మహర్షి తరవాత మహేష్‌బాబు కొన్ని రోజులు విరామం తీసుకున్నారు. విహార యాత్రలో భాగంగా కుటుంబ సమేతంగా ఇంగ్లండ్‌ వెళ్లారు. క్రికెట్‌ మ్యాచ్‌లు కూడా చూశారు. ఇప్పుడు సెలవులు అయిపోయాయి. మహేష్‌ తిరిగి స్వదేశానికి చేరుకున్నారు. తన కొత్త సినిమా సరిలేరు నీకెవ్వరు కోసం కసరత్తులు మొదలెట్టేశారు. ఈ సినిమా నిర్మాణంలోనూ మహేష్‌కి వాటా ఉంది. అందుకే ప్రీ ప్రొడక్షన్‌ పనూలు ఆయన దగ్గరుండి చూసుకుంటున్నారు. జులైలో చిత్రీకరణ ప్రారంభం కానుంది. కశ్మీర్‌ నేపథ్యంలో కొన్ని కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తారు. ఈ సినిమా కోసం మహేష్‌ తన గెటప్‌ని మార్చకున్నారు. మహర్షి లో మీసకట్టుతో కనిపించిన మహేష్‌ ఈసారి మరింత కొత్తగా కనిపిస్తారట. రష్మిక నాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో విజయశాంతి ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు అందిస్తున్నారు.