ఆందోళన వద్దు... రెగ్యులర్ చెకప్!

ఆందోళన వద్దు... రెగ్యులర్ చెకప్!

18-06-2019

ఆందోళన వద్దు... రెగ్యులర్ చెకప్!

ప్రముఖ దర్శకుడు మణిరత్నం(63) హద్రోగ సమస్యతో చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్సలు పొందారు. గుండెలో నొప్పి కారణంగా ఆయన ఆసుపత్రిలో చేరినట్టు వార్తలు రావడంతో సినీ అభిమానులు కలత చెందారు. అయితే రెగ్యులర్‌ చెకప్‌ కోసమే ఆయన ఆస్పత్రికి వెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పరీక్షల అనంతరం మణిరత్నం డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం ఆయన పొన్నియన్‌ సెల్వన్‌ అనే చారిత్రాత్మక చిత్రం నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారు.