బాలకృష్ణ సరసన శ్రియ ?

బాలకృష్ణ సరసన శ్రియ ?

19-06-2019

బాలకృష్ణ సరసన శ్రియ ?

విజయవంతమైన జోడీగా పేరు తెచ్చుకున్నారు బాలకృష్ణ, శ్రియ. చెన్నకేశవరెడ్డి లో తొలిసారి కలిసి నటించిన వీరిద్దరూ ఆ తర్వాత విజయేంద్రవర్మ, గౌతమి పుత్ర శాతకర్ణి, పైసా వసూల్‌ చిత్రాల్లో నటించారు. ఎన్టీఆర్‌ కథానాయకుడు లోనూ మెరిసింది శ్రియ. తాజాగా ఈ జంట మరోసారి కలిసి సందడి చేయబోతోందని సమాచారం. బాలకృష్ణ కథనాయకుడిగా కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సి.కల్యాణ్‌ నిర్మిస్తున్నారు. వచ్చే నెల్లో పట్టాలెక్కనున్న ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన శ్రియని ఎంపిక చేసే అవకాశాలున్నాయి. ఆ మేరకు చిత్రబృందం చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. మరో నాయికకీ చోటుందని, ఆ ఎంపిక పూర్తయ్యాక చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళతారని తెలుస్తోంది.