బహుశా కాలం మారడమంటే ఇదేనేమో...కైరా

బహుశా కాలం మారడమంటే ఇదేనేమో...కైరా

19-06-2019

బహుశా కాలం మారడమంటే ఇదేనేమో...కైరా

కెరీర్‌ ప్రారంభంలో అవకాశాలివ్వండి అని చాలా మంది దర్శకుల చుట్టూ తిరిగా. ఇప్పుడే దర్శకులు మా సినిమాలో చేయండని కలుస్తున్నారు. బహుశా కాలం మారడమంటే ఇదేనేమో అని అంటోంది కైరా అద్వానీ. పుగ్లీ సినిమాతో బాలీవుడ్‌లోకి కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది కైరా. ఆ సినిమా ప్లాన్‌ అవ్వడంతో కైరాకి రెండేండ్ల వరకు ఒక్క ఛాన్స్‌ రాలేదు. అవకాశాల కోసం ఎంతోమంది దర్శక, నిర్మాతల చుట్టూ తిరిగిందట. ఫైనల్‌గా ఎం.ఎస్‌.ధోని ది అన్‌ టోల్డ్‌ స్టోరీతో పాటు, భరత్‌ అనే నేను, వినయ విధేయ రామ తో స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం నటించిన కబీర్‌సింగ్‌ త్వరలోనే విడుదల కానుంది. ఎం.ఎస్‌.ధోని తోపాటు దక్షిణాదిలో చేసిన సినిమాలు నన్ను తిరిగి పుంజుకునేలా చేశాయి. ఇప్పుడు నా చుట్టూ చాలా ఛాన్స్‌లు ఉన్నాయి అని కైరా తెలిపారు.