పోలీస్‌ పాత్రలో అనుష్క ?

పోలీస్‌ పాత్రలో అనుష్క ?

19-06-2019

పోలీస్‌ పాత్రలో అనుష్క ?

బాలీవుడ్‌ కథానాయిక అనుష్కశర్మ గతేడాది వచ్చిన జీరో తర్వాత మళ్లీ కనిపించలేదు. ప్రస్తుతానికి ఆమె ఏ చిత్రంలోనూ నటించడం లేదు. ఆమె తర్వాతి చిత్రానికి సంబంధించి ఓ కథను ఓకే చేసినట్టు సమాచారం. ఇందులో ఆమెది పోలీస్‌ పాత్రట. ఇంతకు ముందెన్నడూ అనుష్కని చూడని కోణంలో ఈ పాత్ర ఉండటంతో ఈ కథ ఆమెకు బాగా నచ్చేసిందట. పూర్తిస్థాయిలో కథ సిద్ధమయ్యాకా అనుష్క తన పాత్ర కోసం ప్రత్యేక శిక్షణ తీసుకోనుందని సమాచారం. కథా బలమున్న పాత్రల్లో నటిస్తున్న అనుష్కకి పోలీస్‌ పాత్ర చేయడం ఇదే తొలిసారి. దర్శక నిర్మాతలు ఎవరనే విషయంలో సృష్టత రావాలంటే మరికొన్ని రోజులు ఆగాలి. అనుష్క తన నిర్మాణ సంస్థ నుంచి తెరకెక్కుతోన్న సినిమాల వ్యవహారాల్లో బిజీగా ఉంది.