కల్కికి గుమ్మడికాయ కొట్టేశారు

కల్కికి గుమ్మడికాయ కొట్టేశారు

19-06-2019

కల్కికి గుమ్మడికాయ కొట్టేశారు

రాజశేఖర్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం కల్కి. ప్రశాంత్‌ వర్మ దర్శకుడు. సి.కల్యాణ్‌ నిర్మాత. ఇటీవల రామోజీ ఫిలింసిటీలో కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కించారు. దాంతో చిత్రీకరణ పూర్తయింది. ఈ నెల 28న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ఇటీవల విడుదల చేసిన టీజర్‌కి మంచి స్పందన వచ్చింది. స్కార్లెట్‌ విల్సన్‌పై తెరకెక్కించిన హార్న్‌ ఒకే ప్లీజ్‌ పాట మాస్‌కి నచ్చేసింది. శ్రవణ్‌ భరద్వాజ్‌ ఇచ్చిన స్వరాలు, నేపథ్య సంగీతం ఆకట్టుకుంటాయి. నిర్మాత రాధామోహన్‌ ఈ చిత్ర హక్కుల్ని సొంతం చేసుకున్నారన్నారు. ఆదాశర్మ, నందితా శ్వేత, పూజితా పొన్నాడ, రాహుల్‌ రామకృష్ణ, నాజర్‌, అశుతోష్‌ రాణా తదితరులు నటించారు.