బుర్రకథ ట్రైలర్‌ను విడుదల చేసిన విక్టరీ

బుర్రకథ ట్రైలర్‌ను విడుదల చేసిన విక్టరీ

25-06-2019

బుర్రకథ ట్రైలర్‌ను విడుదల చేసిన విక్టరీ

దీపాల ఆర్ట్స్‌ టప్‌ఎండ్‌ స్టూడియోస్‌ లిమిటెడ్‌ బ్యానర్లపై శ్రీకాంత్‌ దీపాల, కిషోర్‌, కిరణ్‌ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం బుర్రకథ. డైమెండ్‌ రత్నంబాబు దర్శకత్వంలో ఆది సాయికుమార్‌, మిస్తీ చక్రవర్తి, నైరాశా హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం టీజర్‌ ఇటీవలే విడుదలై విశేష స్పందన రాబట్టుకుంది. తాజాగా హీరో విక్టరీ వెంకటేష్‌ చేతుల మీదుగా ఈ చిత్రం ట్రైలర్‌ విడుదలయ్యింది. హీరో వెంకటేశ్‌ మాట్లాడుతూ ట్రైలర్‌ చాలా ఇంట్రెస్టింగ్‌గా, ఎంటర్‌టైనింగ్‌గా ఉంది. వండర్‌పుల్‌ స్టోరీ. ఆది బెస్ట్‌ పెరెఫార్మెన్స్‌ ఇచ్చారు. డైమండ్‌ రత్నం బాబు డైరెక్షన్‌లో వస్తున్న ఈ బ్యూటీపుల్‌ స్టోరీని ప్రతి ఒక్కరూ చూడాలని కోరుతున్నాను అన్నారు. ఈ నెల 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.