28న మహర్షి అర్ధశతదినోత్సవ వేడుక

28న మహర్షి అర్ధశతదినోత్సవ వేడుక

25-06-2019

28న మహర్షి అర్ధశతదినోత్సవ వేడుక

సూపర్‌స్టార్‌ మహేష్‌, సూపర్‌ హిట్‌ చిత్రాల దర్శకుడు వంశీ పైడిపల్లి కాంబినేషన్లో రూపొందిన ఎపిక్‌ బ్లాక్‌ బస్టర్‌ మహర్షి. వైజయంతి మూవీస్‌, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, పివిపి సినిమా సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అద్భుత విజయాన్ని సాధించి చరిత్ర సృష్టించింది. సూపర్‌ కలెక్షన్స్‌తో మహర్షి 200 సెంటర్స్‌లో జూన్‌ 27న 50 రోజులు పూర్తి చేసుకోనుంది. సూపర్‌స్టార్‌ మహేష్‌ ట్రెమండస్‌ పెర్‌ఫార్మెన్స్‌, వంశీ పైడిపల్లి ఎక్స్‌లెంట్‌ టేకింగ్‌, దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌, వైజయంతి మూవీస్‌, శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్‌, పివిపి సినిమా భారీ నిర్మాణ విలువలు చిత్రాన్ని ఎపిక్‌ బ్లాక్‌ బస్టర్‌గా నిలిపాయి. సినిమా రిలీజ్‌ అయిన అన్ని ఏరియాల్లోనూ సూపర్‌స్టార్‌ మహేష్‌ గత కలెక్షన్‌ రికార్డులను క్రాస్‌ చేసి దిగ్విజయంగా ప్రదర్శింపబడుతోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం జూన్‌ 28న సాయంత్రం మహర్షి 50 రోజుల వేడుకని హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో ఘనంగా జరుపనున్నారు.