లయన్‌కింగ్‌కు జగపతిబాబు డబ్బింగ్‌

లయన్‌కింగ్‌కు జగపతిబాబు డబ్బింగ్‌

26-06-2019

లయన్‌కింగ్‌కు జగపతిబాబు డబ్బింగ్‌

లయన్‌ కింగ్‌ హిందీ వెర్షన్‌ కీలక పాత్రైన ముసాఫాకు షారుక్‌, ముసాఫా తనయుడు సినిమాకు హీరో పాత్రైన సింబాకు షారుక్‌ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌ డబ్బింగ్‌ చెప్పిన విషయం తెలిసిందే. అలానే ఈ సినిమా తెలుగు వెర్షన్‌లో వుంబా పాత్రకు హాస్య నటుడు బ్రహ్మనందం, అలాగే టీమోన్‌ పాత్రకు ఆలీ డబ్బింగ్‌ చెప్పటం కూడా తెలిసిందే. అయితే తెలుగులో ఇప్పటికే క్రేజ్‌ని సొంతం చేసుకున్న ఈ లయన్‌ కింగ్‌లో ఎవర్‌గ్రీన్‌ ఛార్మింగ్‌ స్టార్‌ జగపతి బాబు స్కార్‌ పాత్రకి డబ్బింగ్‌ చెప్పగా.. ముఫార్‌ పాత్రకి డబ్బింగ్‌ స్టార్‌ పి.రవిశంకర్‌ చెప్పటం విశేషం.