'ఆగ్రహం' టీజర్‌ను ఆవిష్కరించిన వర్మ

'ఆగ్రహం' టీజర్‌ను ఆవిష్కరించిన వర్మ

26-06-2019

'ఆగ్రహం' టీజర్‌ను ఆవిష్కరించిన వర్మ

ఎస్‌ఎస్‌ చెరుకూరి క్రియేషన్స్‌ పతాకంపై సుదీప్‌, సందీప్‌ రాజు, సుస్మిత హీరో హీరోయిన్లుగా ఆర్‌ఎస్‌ సురేష్‌ దర్శకత్వంలో సందీప్‌ చెరుకూరి నిర్మాతగా రూపొందించిన చిత్రం ఆగ్రహం. షూటింగ్‌ పూర్తిచేసుకున్న ఈ చిత్రం టీజర్‌ను ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ ముంబైలో ఆవిష్కరించారు. దర్శకుడు సురేష్‌ మాట్లాడుతూ రాజకీయ నేపథ్యంలో రెండు గ్యాంగ్‌ల మధ్య జరిగే గ్యాంగ్‌స్టర్‌ కథాంశమన్నారు. చిత్రంలో 5 ఫైట్స్‌ ఉంటాయి. రవిశంకర్‌ ఆర్‌ఆర్‌ మా చిత్రానికి ప్రధాన ఆకర్షణ అన్నారు. చిత్ర నిర్మాత సురేష్‌ మాట్లాడుతూ కంప్లీట్‌ యాక్షన్‌ ఎలిమెంట్స్‌ ఉన్న చిత్రమన్నారు. జూలైలో చిత్రాన్ని విడుదల చేస్తామన్నారు. చిత్ర దర్శకుడు సురేష్‌, నిర్మాత చెరుకూరి సందీప్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ మూర్తి ఆడారి, సంగీత దర్శకుడు రవిశంర్‌ పాల్గొన్నారు.