28న కెప్టెన్‌ రాణా ప్రతాప్‌ విడుదల

28న కెప్టెన్‌ రాణా ప్రతాప్‌ విడుదల

26-06-2019

28న కెప్టెన్‌ రాణా ప్రతాప్‌ విడుదల

డాక్టర్‌గా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్నాను. సరిహద్దులో శత్రువులతో పోరాడే వీర సైనికుడి కథ ప్రజలకి ప్రేరణగా నిలవాలని కెప్టెన్‌ రాణా ప్రతాప్‌ చిత్రాన్ని స్వీయదర్శకత్వంలో నిర్మించా అన్నారు హరినాథ్‌ పొలిచెర్ల. సుమన్‌ మేజర్‌గా కీలక పాత్ర పోషించిన ఈ చిత్రం 28న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హరినాథ్‌ మీడియాతో మాట్లాడుతూ రెండేళ్లుగా సరిహద్దుల్లో జరుగుతోన్న విషయాలపై పరిశోధన చేసి రాసుకున్న కథ ఇది. కుటుంబ భద్రత కన్నా దేశభద్రతే గొప్పది అని భావించే ఓ సైనికుడి కథని వాణిజ్య హంగులతో తెరకెక్కించాను. షేక్‌పేట చాందిని పాటకి మంచి స్పందన లభిస్తోంది. వైద్యవృత్తితో అమెరికాలో స్థిరపడిన నాకు సినిమాల ద్వారా ప్రజలకు ఏదో చెప్పాలనే అభిలాష ఉంది. చిన్నప్పట్నుంచే నాటకాల్లో నటించా. నిర్మాతగా 11 సినిమాలు తీశా. కథానాయకుడిగా నేనే నటించా. నాలుగింటికి దర్శకత్వం చేశా. కొంత సమయం తీసుకుని నా 12వ చిత్రాన్ని తీస్తా. రజాకార్ల ఉద్యమ నేపథ్యంలో సాగే ఆ చిత్రానికి నేను నిర్మాతగా మాత్రమే ఉంటానన్నారు.