అల్లు అర్జున్‌ సరసన రాశీ ఖన్నా ?

అల్లు అర్జున్‌ సరసన రాశీ ఖన్నా ?

10-07-2019

అల్లు అర్జున్‌ సరసన రాశీ ఖన్నా ?

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా ఐకాన్‌ అనే చిత్రం తెరకెక్కబోతోంది. వేణు శ్రీరామ్‌ దర్శకత్వం వహిస్తారు. దిల్‌రాజు నిర్మాత. ఈ చిత్రంలో కథానాయికగా రాశీ ఖన్నాని ఎంచుకున్నట్టు తెలుస్తోంది. బన్నీ, రాశీ జంటగా నటించడం ఇదే తొలిసారి. ప్రస్తుతం త్రివిక్రమ్‌తో కలసి ఓ సినిమా చేస్తున్నారు అల్లు అర్జున్‌. అది చిత్రీకరణ దశలో ఉంది. ఆ వెంటనే ఐకాన్‌ పట్టాలెక్కుతుంది. ఇప్పటికే ఐకాన్‌ స్క్రిప్టు సిద్ధమైపోయింది. బన్నీ రాక కోసమే చిత్రబృందం ఎదురుచూస్తోంది. త్వరలోనే రాశీ ఖన్నా ఎంట్రీకి సంబంధించిన అధికారిక ప్రకటన రావొచ్చు.