సంక్రాంతి బరిలో బన్నీ

సంక్రాంతి బరిలో బన్నీ

11-07-2019

సంక్రాంతి బరిలో బన్నీ

అల్లు అర్జున్‌ హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతుంది. హారికా అండ్‌ హాసిని క్రియేషన్స్‌, గీతా ఆర్ట్స్‌ పతాకాలపై ఎస్‌.రాధాకృష్ణ, అల్లు అరవింద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. వీరిద్దరు జోడీగా నటిస్తున్న తొలి చిత్రమిది. 19వ చిత్రంగా నటిస్తున్న బన్నీకి తల్లిగా టబు, హీరో సుశాంత్‌ ఓ ముఖ్య పాత్రని పోషిస్తున్నాడు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్టు చిత్ర బృందం తెలిపింది. జలాయి, సన్నాఫ్‌ సత్యమూర్తి, వంటి చిత్రాల తర్వాత అల్లు అర్జున్‌ త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా ఇది.