ఆ నమ్మకంతోనే ఈ చిత్రంలో నటించాం

ఆ నమ్మకంతోనే ఈ చిత్రంలో నటించాం

11-07-2019

ఆ నమ్మకంతోనే ఈ చిత్రంలో నటించాం

రామ్‌, నిధి అగర్వాల్‌, నభా నటేష్‌ హీరో హీరోయిన్లుగా పూరీ జగన్నాథ్‌ స్వీయ దర్శకత్వంలో ఛార్మితో కలిసి నిర్మిస్తున్న చిత్రం ఇస్మార్ట్‌ శంకర్‌. విడుదలకు సిద్దమవుతున్న ఈ చిత్రం గురించి విజయవాడలో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో హీరో రామ్‌ మాట్లాడుతూ మా సినిమా ట్రైలర్‌, సాంగ్స్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. పూరీ జగన్నాధ్‌పై ఉన్న నమ్మకంతోనే ఈ చిత్రంలో నటించాం. సినిమాలో ఇద్దరు కథానాయికలు నిధి, నభా నటేష్‌ ఉన్నారు. వాళిద్దరు పోటీపడీ మరి నటించారు.

ఈ మధ్య కాలంలో ఇద్దరు హీరోయిన్స్‌తో కలిసి నటిస్తున్న చిత్రాలు విజయవంతం అవుతున్నాయి. ఆ సెంటిమెంట్‌ వర్కౌట్‌ అయి మా సినిమా కూడా సక్సెస్‌ అవుతుందని ఆశిస్తున్నా. ఇది రామ్‌, పూరీల సినిమాగా మీడియా బాగా ప్రమోట్‌ చేస్తుంది. జగడం తర్వాత నేను పూర్తి స్థాయి మాస్‌ క్యారెక్టర్‌ చేసిన చిత్రమిది. ఇందులో నా ప్రాతని బట్టి భాష ఉంటుంది. ఆది ఆడియెన్స్‌ని బాగా ఆకట్టుకుంటుంది అని అన్నారు. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో నటించడం మా కెరీర్‌కి ఎంతగానో ఉపయోగపడుతుంది. నటనకు ప్రాధన్యం ఉన్న పాత్రల్లో నటించాం. మా పాత్రలు, సినిమా విశేషంగా ఆకట్టుకుంటుంది. సినిమాని ఆదరించి పెద్ద హిట్‌ చేయాలని కోరుతున్నాం అని కథానాయికలు తెలిపారు.