కాశ్మీర్‌లో మేజర్‌ అజయ్‌ కృష్ణ

కాశ్మీర్‌లో మేజర్‌ అజయ్‌ కృష్ణ

11-07-2019

కాశ్మీర్‌లో మేజర్‌ అజయ్‌ కృష్ణ

మహేశ్‌బాబు హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో దిల్‌ రాజు, అనిల్‌ సుంకర నిర్మిస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. ప్రస్తుతం కశ్మీర్‌లో చిత్రీకరణ చేస్తున్నారు. ఆర్మీ నేపథ్యంలో కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఇందులో మహేశ్‌బాబు మేజయ్‌ అజయ్‌ కృష్ణగా నటిస్తున్నారని అనిల్‌ రావిపూడి ట్వీట్‌ చేశారు. 2020 సంక్రాంతికి చిత్రాన్ని విడుదల చేస్తామని ఆయన పేర్కొన్నారు. రష్మిక మందన్న హీరోయిన్‌గా, విజయశాంతి ముఖ్యమైన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీత దర్శకుడు.