దర్పణం వీడియో లిరికల్‌

దర్పణం వీడియో లిరికల్‌

11-07-2019

దర్పణం వీడియో లిరికల్‌

తనిష్క్‌రెడ్డి, ఎలక్సియన్‌ హీరో హీరోయిన్లుగా రామ కృష్ణ వెంప దర్శకత్వంలో క్రాంతికిరణ్‌ వెల్లంకి నిర్మిస్తోన్న చిత్రం దర్పణం. విడుదలైన ట్రైలర్‌కి మంచి స్పందన వచ్చింది. తాజాగా నిర్మాత రాజ్‌ కందుకూరి చేతులమీదుగా వీడియో లిరికల్‌ విడుదల చేశారు. పోస్ట్‌ ప్రొడక్షన్స్‌ జరుగుతున్నాయని, జూలైలోనే సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్టు నిర్మాతలు తెలిపారు. రాజ్‌ కందుకూరి మాట్లాడుతూ సిద్దార్థ్‌ కంపోజ్‌ చేసిన ఎదురాయె పాట బానీ బావుందని, సినిమా కోసం దర్శకుడు పడిన కష్టం కనిపిస్తోందన్నారు. దర్శకుడు రామకృష్ణ వెంప మాట్లాడుతూ క్రైమ్‌, సప్పెన్స్‌, థ్రిల్లర్‌ జోనర్‌లో సినిమాను తెరకెక్కించామన్నారు. నిర్మాత క్రాంతికిరణ్‌ వెల్లంకి మాట్లాడుతూ ఇప్పుడొస్తున్న థ్రిల్లర్‌ కంటెంట్‌కు మించి సినిమా ఉంటుందన్నారు.