నేనే కేడీ నెం-1 ట్రైలర్‌ లాంచ్‌ చేసిన సి.కళ్యాణ్‌

నేనే కేడీ నెం-1 ట్రైలర్‌ లాంచ్‌ చేసిన సి.కళ్యాణ్‌

11-07-2019

నేనే కేడీ నెం-1 ట్రైలర్‌ లాంచ్‌ చేసిన సి.కళ్యాణ్‌

శంభో శంకర చిత్రంతో హీరోగా మంచి గుర్తింపు, భారీ ఓపెనింగ్స్‌ రాబట్టుకున్న షకలక శంకర్‌ నటిస్తోన్న తాజా చిత్రం నేనే కేడీ నెం-1. ఆర్‌ ఏ ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌ బేనర్‌పై ఎం.డి రౌఫ్‌ సమర్పణలో జాని స్వీయ దర్వకత్వంలో నిర్మిస్తున్నారు. ముస్కాన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 26న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా ఈ చిత్రం ట్రైలర్‌ తెలుగు ఫిల్మ్‌ ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడు, ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్‌ చేతుల మీదుగా నేనే కేడీ నెం-1 ట్రైలర్‌ లాంచ్‌ కార్యక్రమం ఫిలించాంబర్‌లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా దర్శక నిర్మాత జాని మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో పిల్లలు చెడు వ్యసనాలకు బానిసలవుతున్నారంటే దానికి కారణం తల్లిదండ్రులు కూడా. నేటి బిజీ లైఫ్‌లో తల్లిదండ్రులు పిల్లలను పట్టించుకోకుండా, బాధ్యతలు తెలపకుండా, పూర్తి స్వేచేనిస్తూ గాలికి వదిలేస్తున్నారు. ఈ క్రమంలో యువత పెడదోవ పడుతోంది అనే అంశాన్ని మా సినిమాలో చూపించాం. ఈ నెల 26న గ్రాండ్‌గా రిలీజ్‌ ప్లాన్‌ చేస్తున్నాం అన్నారు.