మెగాస్టార్‌ జోడీగా ఐష్‌?

మెగాస్టార్‌ జోడీగా ఐష్‌?

12-07-2019

మెగాస్టార్‌ జోడీగా ఐష్‌?

మాజీ ప్రపంచ సుందరి ఐశ్యర్యా రాయ్‌ అంటే అభిమానుల్లో ఇప్పటికీ ప్రత్యేకమైన స్థానం ఉంది. పెళ్లయ్యాక కూడా ఇటీవల ఆమె హిందీలో రెండు సినిమాలు చేసింది కానీ అవేమీ ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయాయి. అయినా కూడా ఆఫర్స్‌కు కొదవ లేదని ఐష్‌ కథ నచ్చితే తప్ప సినిమా చేయడానికి ఒప్పుకోదు. ఈ నేపథ్యంలో కొరటాల శివ దర్శకత్వంలో రూపొందబోయే మెగాస్టార్‌ చిరంజీవి 152వ సినిమా కోసం ఒక హీరోయిన్‌గా ఐష్‌ను తీసుకుందామని ప్లాన్‌ చేస్తున్నారట. త్వరలోనే ఆమెకు కథ చెప్పనున్నారని తెలిసింది. సైరా లో ఐశ్వర్యారాయ్‌ మావయ్య బిగ్‌ బి అమితాబ్‌ బచ్చన్‌ ఓ కీలక పాత్ర చేశారు. అంతకు ముందే నుంచే అమితాబ్‌కు మెగా ఫ్యామిలీతో మంచి అనుబంధం ఉంది. చిరంజీవి అడగాలే కాని ఐశ్వర్యారాయ్‌తో సమావేశం ఏర్పాటు చేయడం నిముషాల్లో పని. మరి ఇది నిజంగా కార్యరూపం దాల్చితే మెగా ఫ్యాన్‌సకు అంతకన్నా గుడ్‌ న్యూస్‌ ఏముంటుంది.