వైఫ్‌.ఐ ఫస్ట్‌లుక్‌ విడుదల

వైఫ్‌.ఐ ఫస్ట్‌లుక్‌ విడుదల

12-07-2019

వైఫ్‌.ఐ ఫస్ట్‌లుక్‌ విడుదల

అభిషేక్‌ రెడ్డి, సాక్షి నిదియా జంటగా నటించిన చిత్రం వైఫ్‌.ఐ. వైఫ్‌ బెటర్‌ దెన్‌ నైఫ్‌ అనేది ఉపశీర్షిక. జీఎస్‌ఎస్‌పీ కల్యాణ్‌ దర్శకుడు. చరితారెడ్డి నిర్మాత. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ అపార్థాలు, అసూయల వల్ల భార్యభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు మొదలవుతాయి. ఆ తప్పులు తెలుసుకుని, సరిదిద్దుకోగలిగితే కాపురాలు సజావుగా సాగుతాయి. ఇదే అంశాన్ని వినోదాత్మకంగా చూపించాం అన్నారు.