పండుగాడి ఫోటో స్టూడియో టీజర్‌ విడుదల

పండుగాడి ఫోటో స్టూడియో టీజర్‌ విడుదల

14-07-2019

పండుగాడి ఫోటో స్టూడియో టీజర్‌ విడుదల

అలీ కథానాయకుడిగా నటించిన చిత్రం పండుగాడి ఫొటో స్టూడియో. దిలీప్‌రాజా దర్శకుడు. గుదిబండి వెంకట సాంబిరెడ్డి నిర్మాత. ఈ నెల 21న తెనాలిలో విడుదల ముందస్తు వేడుకని నిర్వహించబోతున్నారు. హైదరాబాద్‌లో దర్శకుడు సుకుమార్‌ టీజర్‌ని విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నేను అలీకి పెద్ద అభిమానిని. ఈ సినిమాతో ఆయన కథానాయకుడిగా రెండో ఇన్నింగ్స్‌ని ప్రారంభించారు. పాటలు బాగున్నాయి. జంధ్యాల మార్క్‌ కామెడీ ఇందులో ఉంది అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ విలక్షణమైన పాత్రలతో, ప్రేక్షకుల్ని నవ్వించడమే లక్ష్యంగా రూపొందించిన చిత్రమిది. మా సినిమాలో పండుగాడు ఎవరికి ఫొటో తీస్తే వాళ్లకి పెళ్లైపోతుంటుంది. దానివల్ల ఎలాంటి పరిణామాలు చోటు చేసుకొన్నాయో తెరపైనా చూడాలి. యాజమాన్య సంగీత సారథ్యంలో శ్రేయగోషల్‌, మనీషా పాడిన పాటలు బాగుంటాయన్నారు.