రాశిఖన్నాకు లక్కీ ఛాన్స్‌!

రాశిఖన్నాకు లక్కీ ఛాన్స్‌!

14-07-2019

రాశిఖన్నాకు లక్కీ ఛాన్స్‌!

గ్లామర్‌ భామ రాశిఖన్నా లక్కీ ఛాన్స్‌ కొట్టేసింది. ఇప్పటి వరకు ఆమె పెద్దగా స్టార్‌ హీరోలతో సినిమాలు చేయలేదు. అయితే రవితేజ, గోపీచంద్‌ లాంటి హీరోలతోనే సరిపెట్టుకున్న ఈ అమ్మడికి ఇప్పుడు లక్కీ ఛాన్స్‌ దక్కింది. ఆ వివరాల్లోకి వెళితే.. అల్లు అర్జున్‌ ప్రస్తుతం త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్‌ చేస్తున్నారట. ఈ సినిమా తరువాత అల్లు అర్జున్‌ ఎంసిఏ ఫేమ్‌ వేణుశ్రీరామ్‌ దర్శకత్వంలో మరో సినిమాకు కమిట్‌ అయిన విషయం తెలిసిందే. ఐకాన్‌ పేరుతో తెరకెక్కే ఈ సినిమాలో హీరోయిన్‌గా రాశిఖన్నాను ఎంపిక చేశారట. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్‌ పనులు జరుపుతున్నాడు వేణుశ్రీరామ్‌. దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ సెప్టెంబర్‌లో మొదలవుతుందట. ప్రస్తుతం ఆమె నాగచైతన్యకు జోడీగా వెంకీ మామ సినిమాలో నటిస్తుంది.