ఎవరు ఫస్ట్‌లుక్‌ విడుదల

ఎవరు ఫస్ట్‌లుక్‌ విడుదల

14-07-2019

ఎవరు ఫస్ట్‌లుక్‌ విడుదల

అడివి శేష్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఎవరు. రెజీనా నాయిక. పెరల్‌ వి.పొట్లూరి, పరమ్‌ వి.పొట్లూరి, కెవిన్‌ అన్నె నిర్మాతలు. వెంకట్‌ రామ్‌జీ దర్శకుడు. నవీన్‌ చంద్ర కీలక పాత్రధారి. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. ఆగస్టు 23న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. అడివి శేష్‌ పోలీస్‌ అధికారిగా నటిస్తున్న చిత్రమిది. ఈ కథలో పోలీసు ఎవరి కోసం ఏం చేశాడన్నది ఆసక్తికరం. శ్రీచరణ్‌ పాకాల సంగీతం ఆకట్టుకుంటుంది అన్నాయి చిత్రవర్గాలు.