సైరాలో అనుష్క పాత్రపై క్లారిటీ

సైరాలో అనుష్క పాత్రపై క్లారిటీ

17-07-2019

సైరాలో అనుష్క పాత్రపై క్లారిటీ

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా మెగాస్టార్‌ చిరంజీవి ప్రధానపాత్రలో రూపొందుతున్న చిత్రం సైరా నరసింహారెడ్డి. ఈ చిత్రాన్ని అక్టోబర్‌ 2 గాంధీజయంతి సందర్భంగా విడుదల చేయాలని యూనిట్‌ సన్నాహాల్లో ఉంది. ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్‌ పనులతో బిజీగా ఉంది. అయితే అనుష్క సైరాలో ఝాన్సీ లక్ష్మీబాయి పాత్రలో నటించనుందని కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో వార్తలొస్తున్నాయి. అయితే అనుష్క పాత్ర స్టోరీ టెల్లర్‌గా ఉంటుందని తెలుస్తోంది. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఈచిత్రంలో సుదీప్‌, అమితాబ్‌ బచ్చన్‌, జగపతిబాబు వంటి స్టార్లు నటిస్తున్నారు. నయనతార హీరోయిన్‌గా నటిస్తున్నారు.