లీకు వీరులకు క్లాసు

లీకు వీరులకు క్లాసు

19-07-2019

లీకు వీరులకు క్లాసు

బాలకృష్ణ లెజెండ్‌ సినిమాలో నటించి ప్రేక్షకులను అలరించిన భామ రాధికా ఆప్టే. ఈ భామ బాలీవుడ్‌లో పలు సినిమాల్ల హాట్‌హాట్‌గా నటించి సందడి చేస్తోంది. అయితే బాలీవుడ్‌లో వివాదాల ద్వారానే బాగా పాపులర్‌ అయింది. అవకాశాలకు లోటు లేకుండా ఏదో ఒక సినిమాతో బిజీగా ఉండే రాధికా ఆప్టే తాజాగా మరోసారి వార్తాల్లో నిలిచింది. ఇటీవలే తను నటించిన వెడ్డింగ్‌ గెస్ట్‌ అనే మల్టీ లాంగ్వేజ్‌ మూవీ ఇండియాలో విడుదల కావాల్సి ఉంది. కానీ ఈ లోగా అందులో రాధికా ఆప్టే హీరోతో కలిసి నటించిన కొన్ని బెడ్‌రూమ్‌ సీన్స్‌ ఆన్‌లైన్‌లో లీకైపోయాయి. దీంతో ఇప్పుడు ఈ భామ భగ్గుమంటోంది. హీరో దేవ్‌ పటేల్‌తో తాను ఉన్న సీన్లు మాత్రమే బయటికి వదిలారని.. అంతకన్నా గొప్పగా అనిపించే, ఎన్నో హత్తుకునే సన్నివేశాలు అందులో ఉన్నాయని అవెందుకు చూపించరని నిలదీస్తోంది. కేవలం హాట్‌ సీన్లను హైలైట్‌ చేస్తూ సొమ్ములు చేసుకోవాలనుకునే లీకు వీరులకు క్లాస్‌ పీకింది. అయితే ఇదంతా వెడ్డింగ్‌ గెస్ట్‌ ప్రమోషన్‌ కోసమని అంటున్న వాళ్ళూ లేకపోలేదు. ఏదైతేనేం కొంత గ్యాప్‌ తర్వాత మళ్లీ రాధికా ఆప్టే న్యూస్‌లోకి వచ్చింది.