సూపర్‌ 30ని వీక్షించిన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

సూపర్‌ 30ని వీక్షించిన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

19-07-2019

సూపర్‌ 30ని వీక్షించిన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

సమాజం, దేశ ప్రగతిలో విద్య కీలక పాత్ర పోషిస్తుందని ప్రజా సాధికారికతకు అదే మూలమని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. సూపర్‌ 30 కోచింగ్‌ సెంటర్‌ ద్వారా ఏటా 30 మంది విద్యార్థులను ఐఐటీ- జేఈఈ సాధించేలా శిక్షణ ఇస్తున్న ఆనంద్‌ కుమార్‌ జీవితం ఆధారంగా తీసిన సూపర్‌ 30 సినిమాను ఉప రాష్ట్రపతి సతీమణి ఉషమ్మతో కలిసి తన నివాసంలో వీక్షించారు. అనంతరం చిత్ర కథానాయకుడు హృతిక్‌ రోషన్‌, చిత్ర నిర్మాత సాజిద్‌ నడియాడ్‌వాల, చిత్రానికి ప్రేరణగా నిలిచిన ఆనంద్‌ కుమార్‌, ఆయన కుటుంబ సభ్యులను ఉప రాష్ట్రపతి అభినందించారు. ఉప రాష్ట్రపతితో పాటు రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సీఈవో సుభాశిష్‌ సర్కార్‌, నిర్మాత మధు మంతెన, ప్రసార భారతి చైర్మన్‌ ఎ.సూర్యప్రకాశ్‌ తదితరులు సినిమాను వీక్షించారు.