నాగార్జున ఇంటిని ముట్టడించిన ఓయూ విద్యార్థులు

నాగార్జున ఇంటిని ముట్టడించిన ఓయూ విద్యార్థులు

20-07-2019

నాగార్జున ఇంటిని ముట్టడించిన ఓయూ విద్యార్థులు

ప్రముఖ సినీనటుడు నాగార్జున వ్యాఖ్యాతగా ప్రారంభం కానున్న రియాల్టీ షో బిగ్‌బాస్‌-3ని నిలిపివేయాలంటూ ఓయూ ఐకాస విద్యార్థులు ఆందోళనకు దిగారు. జూబ్లీహిల్స్‌లోని ఆయన ఇంటిని ముట్టడించారు. బిగ్‌బాస్‌ షోను నిలిపి వేయాలంటూ, నాగార్జున డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేస్తూ నిరసనకు దిగారు. ఓయూ జేఏసీ నాయకుడు కందుల మధు ఆధ్వర్యంలో బిగ్‌బాస్‌కు వ్యతిరేకంగా ఓయూ విద్యార్థలు ఆందోళన చేపట్టారు. బిగ్‌బాస్‌-3 వివాదంపై ఇద్దరు మహిళలు ఒంటరి పోరాటం చేస్తుంటే, నాగార్జున కనీసం స్పందించడం లేదని ఆరోపించారు. మహిళలను కించపరిచే షో కి నాగార్జున ఏ రకంగా వ్యాఖ్యాతగా ఉంటారని ప్రశ్నించారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. వెంటనే అరెస్టు చేసి జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.