అమెరికాలో రానా

అమెరికాలో రానా

20-07-2019

అమెరికాలో  రానా

రానా దగ్గుబాటి వరుసగా సినిమాలు చేయబోతున్నారు. ఆయన కోసం పలు కథలు సిద్ధంగా ఉన్నాయి. గుణశేఖర్‌ దర్శకత్వంలో హిరణ్య తో పాటు వేణు ఊడుగుల దర్శకత్వంలో విరాటపర్వం చేయబోతున్నారు. త్వరలోనే విరాటపర్వం చిత్రీకరణ మొదలు కానుంది. ప్రస్తుతం రానా అమెరికాలో ఉన్నారు. బీపీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్టు ఆయన గతేడాది వెల్లడించారు. అందుకు సంబంధించి చికిత్స తీసుకొనేందుకు రానా తన కుటుంబ సభ్యులతో కలిసి ఇటీవల అమెరికా వెళ్లినట్టు సమాచారం. అక్కడ్నుంచి తిరిగి రాగానే ఆయన కొత్త సినిమాల కోసం రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. ఆరోగ్యం ఎలా ఉందని ఒక అభిమాని చేసిన ట్వీట్‌కి రానా స్పందిస్తూ ఎక్కువ ఒత్తిడి చేయొద్దు. చెత్త ప్రచారానికి స్పందించొద్దు అంటూ బదులిచ్చారు.