ఆ ప్రచారంలో నిజం లేదు : జగపతిబాబు

ఆ ప్రచారంలో నిజం లేదు : జగపతిబాబు

20-07-2019

ఆ ప్రచారంలో నిజం లేదు : జగపతిబాబు

సరిలేరు నీకెవ్వరు నుంచి తానే బయటికొచ్చినట్టు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని ప్రముఖ నటుడు జగపతిబాబు వెల్లడించారు. ఆ సినిమా కోసం, మరో రెండు సినిమాలు వదులుకొన్నానని, ఆ పాత్ర నాకు అంత బాగా నచ్చిందని, ఇప్పటికీ తాను చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన సృష్టం చేశారు. చిత్ర పరిశ్రమ నాకు కుటుంబం లాంటిది. అందుకే దాని గురించి మాట్లాడటం నాకు ఇష్టం లేదు. కానీ ఒక విషయంలో సృష్టత ఇవ్వక తప్పడం లేదు. నా 33 ఏళ్ల కేరీర్‌లో ఎప్పుడూ ఇలా వివరణ ఇవ్వాల్సిన అవసరం రాలేదు. పరిశ్రమలో కొన్ని కారణాల వల్ల మరికొన్ని విషయలు జరుగుతుంటాయి. అవి ప్రయాణంలో ఓ భాగం. అలాంటి పరిస్థితుల వల్లే సరిలేరు నీకెవ్వరు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది అన్నారు జగపతిబాబు.