నిన్నే పెళ్లాడతా లోగో ఆవిష్కరణ

నిన్నే పెళ్లాడతా లోగో ఆవిష్కరణ

20-07-2019

నిన్నే పెళ్లాడతా లోగో ఆవిష్కరణ

కథానాయిక రకుల్‌ప్రీత్‌ సింగ్‌ సోదరుడు అమన్‌ కథానాయకుడిగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. సిద్దిక కథానాయిక. వైకుంఠ బోను దర్శకుడు. బొల్లినేని రాజ శేఖర్‌చౌదరి, వెలుగోడు శ్రీధర్‌ బాబు నిర్మాతలు. ఈ చిత్రానికి నిన్నే పెళ్లాడతా అనే పేరును ఖారారు చేశారు. టైటిల్‌ లోగోని ప్రమఖ హీరో నాగార్జున హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ కథకి తగ్గ పేరు ఇది. నాగార్జున, టబు కలిసి నటించిన నిన్నే పెళ్లాడతా ఘన విజయం సాధించింది. ఆ పేరుతోనే మేం సినిమా చేస్తుండడం, ఆ పేరుతో కూడిన లోగోని నాగార్జున ఆవిష్కరించడం ఆనందంగా ఉంది. అక్టోబరులో సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ వైవిధ్యమైన కథతో దర్శకుడు చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పరిశ్రమకి కొత్తయినా మాకు ప్రోత్సాహాన్ని అందించారు నాగార్జున అన్నారు. ఛాయాగ్రహణం: ఈదర ప్రసాద్‌, సంగీతం: నవనీత్‌.